Home

»

Latest News

బన్నీ క‌థ‌లో ర‌వితేజ‌??

May 11, 2015

కందిరీగ‌తో మాస్ ద‌ర్శ‌కుడు అనిపించుకొన్నాడు సంతోష్ శ్రీ‌నివాస్. ఆ ఒక్క సినిమాతోనే యంగ్ టైగ‌ర ఎన్టీఆర్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే ద్వితీయ‌వీఘ్నం గ‌ట్టిగా త‌గిలింది. ర‌భ‌స ఫ్లాప్ అవ్వ‌డంతో సంతోష్‌తో సినిమా చేయ‌డానికి ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ర‌భ‌స టైమ్‌లోనే బ‌న్నీ కోసం ఓ క‌థ రాసుకొన్నాడు సంతోష్ శ్రీ‌నివాస్‌. దానికి తిక్క‌రేగితే.. అనే టైటిల్ కూడా పెట్టేశాడు. ర‌భ‌స హిట్ అయితే బ‌న్నీ అవ‌కాశం ఇచ్చేవాడేమో. కానీ.. ర‌భ‌స ఫ్లాప్ అవ్వ‌డంతో బ‌న్నీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌థ వినిపించే సాహ‌సం చేయ‌లేక‌పోయాడు సంతోష్. ఇప్పుడు అదే క‌థ‌కు ర‌వితేజ‌కు వినిపించి ఓకే చేయించుకోవాల‌నుకొంటున్నాడీ యువ ద‌ర్శ‌కుడు. ఆల్రెడీ ర‌వితేజ నుంచి పిలుపొచ్చింద‌ని, కిక్ 2 హంగామా ముగిశాక‌... ర‌వితేజ‌కు క‌థ వినిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి బ‌న్నీకి రాసుకొన్న క‌థ ఇది. ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేశాడ‌ట‌. మ‌రి మాస్ మ‌హారాజా క‌నిక‌రిస్తాడో లేదో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com