ఫ్యాన్స్ వల్ల నేను తలదించుకున్నాను - అల్లు అర్జున్
on May 18, 2016
నాగశౌర్య, నీహారిక జంటగా తెరకెక్కిన ఒక మనసు ఆడియో ఫంక్షన్ ఈ రోజు జరుగుతోంది. మెగాస్టార్, పవర్ స్టార్ తప్ప మొత్తం మెగా హీరోలందరూ ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తనపై వచ్చిన కాంట్రవర్సీకీ సమాధానం చెప్పారు. మెగాఫ్యాన్స్ అందరికీ ఒకేసారి క్లియర్ గా క్లారిటీ ఇస్తున్నానంటూ స్టైలిష్ స్టార్ ఎమోషనల్ గా మాట్లాడారు. ఆయన స్పీచ్ ఆయన మాటల్లో..
నేను పవర్ స్టార్ గురించి మాట్లాడను అన్నాను. అందుక్కారణం ఉంది. ప్రతీసారీ ఫంక్షన్ జరిగినప్పుడు మీరు పవర్ స్టార్ అంటూ అరవడం, మాట్లాడే వాళ్లను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఫ్యాన్స్ అందరికీ కాదు. కొంతమంది ఫ్యాన్స్ కు మాత్రమే. ఆ కొంతమంది ఒక ముఠాలా తయారై ఎక్కడ ఫంక్షన్ జరిగినా పవర్ స్టార్ అంటూ అరుస్తున్నారు. స్టేజ్ పై మాట్లాడే ఆర్టిస్టుకు చాలా చెప్పాలని ఉంటుంది. మీరు చెప్పే ఆ పవర్ స్టార్ అన్న మాటలకు వాళ్లు చెప్పాలనుకున్నది వదిలేస్తారు. మీకోసం వాళ్ల మనసులో లేకపోయినా, మొక్కుబడిగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేసి వెళ్లిపోతారు. అదే మీరు సైలెంట్ గా ఉంటే, వాళ్ల స్పీచ్ తో పాటు, మనసులో కళ్యాణ్ గారిపై ఉన్న ప్రేమను కూడా బయటికి ఎక్స్ ప్రెస్ చేస్తారు. దయచేసి ఆర్టిస్టులు మాట్లాడేప్పుడు డిస్ట్రబ్ చేయద్దు.
పోనీ మన ఫంక్షన్లలో అరిచారంటే ఓకే. అంతా మనవాళ్లే కదా అని గర్వంగా ఉంటుంది. కానీ బయటి వాళ్ల ఫంక్షన్లలో కూడా అరవడం చాలా తప్పు బ్రదర్. ఒకసారి బయటి వ్యక్తి వచ్చి, మా వాళ్ల ఫంక్షన్లో మీ వాళ్లెందుకు అరిచారు అని అడిగాడు. నేను తలదించుకున్నాను. అది కేవలం మీవల్లే. పవర్ స్టార్ అంటూ అరిచే ఆ కొద్ది మంది వల్లే. నిజంగా నన్ను చాలా బాధపెట్టారు బ్రదర్. కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు తాను ఇంతలా ఎదగడానికి చిరంజీవి గారే కారణమని చెప్పారు. అలాంటి చిరంజీవి గారిని కూడా మాట్లాడనివ్వకుండా మీరు అరవడం నాకు చాలా బాధ వేసింది. చిరంజీవి గారి స్థాయి ఉన్న వ్యక్తిని మీరు అవమానించారు. ఆయన్ను కూడా బాధపెట్టారు. ఇవన్నీ మీకు తెలియాలనే, కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడలేదు.
నాకు తెలుసు. ఇప్పుడు నేను ఉన్న స్టేజ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో అదృష్టం కలిసొచ్చేసి వరసగా మూడు హిట్లు పడ్డాయి. దీంతో తలపొగరెక్కిపోయిందనో, లేక ఇంకొకటో మీరు అనుకుంటారని నాకు తెలుసు. కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా కాంట్రవర్సీని అవాయిడ్ చేస్తున్నాననుకున్నాను. కానీ అవాయిడ్ చేయడమే కాంట్రవర్సీ అయింది. నేను అన్నీ ఆలోచించే మాట్లాడతున్నాను. మరొక్క మాట. సోషల్ మీడియాలో మీ వెర్బల్ వార్స్ దయచేసి ఆపండి. అది చాలా చీప్ గా తయారౌతున్నాయి. మీలో ఎన్ని గ్రూపులైనా ఉండచ్చు. కానీ మేమంతా ఒకే ఫ్యామిలీ. మీరు చేసే సోషల్ మీడియా పనులు, మాకు ఇబ్బందిని కలిగిస్తాయి.
ఇలా చెప్పను బ్రదర్ కాంట్రవర్సీపై స్పందించి, చివరిగా రుద్రమదేవిలోని గమ్మునుండవోయ్ అన్న డైలాగ్ చెప్పి తన స్పీచ్ ను ముగించారు స్టైలిష్ స్టార్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
