Home

»

Latest News

బ‌న్నీ టార్గెట్ వంద కోట్లు

Jun 13, 2017 12:34PM

తెలుగు సినిమా రూ.50 కోట్లు దాటి, వంద కోట్ల వైపు నుంచి బాహుబ‌లి పుణ్యాన 1500 కోట్ల స్థాయికి చేరుకొంది. ఇప్పుడు కూడా రూ.50 కోట్లు, వంద కోట్ల గురించి మాట్లాడుకోవ‌డం అన‌వ‌స‌ర‌మే. అయితే... కొంత‌మంది హీరోలు మాత్రం ఇంకా వంద కోట్ల రుచిని చూడ‌లేదు. అలాంటి వాళ్ల‌లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. బ‌న్నీ సినిమా వంద కోట్ల మైలు రాయిని అందుకోలేక‌పోయింది. స‌రైనోడు రూ.70 కోట్ల ద‌గ్గ‌ర ఆగిపోయింది. అయితే డీజే ఆ లోటు తీరుస్తుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు బ‌న్నీ ఫ్యాన్స్‌. స‌రైనోడు క‌మ‌ర్షియ‌ల్ గా భారీ విజ‌యం సాధించ‌డంతో ఆ ఎఫెక్ట్ డీజేపై ప‌డింది. పైగా దిల్ రాజు సినిమా. అందుకే.. పంపిణీదారులు ఈ సినిమా కోసం వ‌రుస క‌డుతున్నారు. విడుద‌ల‌కు ముందే ఈ సినిమా దాదాపుగా రూ.80 కోట్ల బిజినెస్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. టాక్ బాగుంటే... మ‌రో సినిమా లేదు కాబ‌ట్టి రూ.100 కోట్లు సాధించొచ్చ‌ని చెబుతున్నారు. సో... బ‌న్నీ ఫ‌స్ట్ టార్గెట్ రూ.100 కోట్లు. డీజే అధి సాధించేలానే క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com