నాపై కూడా లైంగికదాడి జరిగింది
on Jul 28, 2017
లైంగిక వేధింపులకు ఆడామగా వ్యత్యాసం ఉండదు. ఆడవారు, చిన్న పిల్లలు లైంగిక వేధింపులకు బలి అవ్వడం మనకు తెలుసు. కానీ... మగ పిల్లలు కూడా లైంగిక వేధింపులకు గురి అవుతుంటారు... అవుతున్నారు కూడా. అయితే... ఇది ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిసినా... ఈ విషయం బయటకు రానీయరు. ఎందుకంటే... బాధితులు మగ పిల్లలు కదా. ఈ విషయంపై ముంబయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ అద్భుతంగా స్పందించారు. అంతేకాదు... చిన్నతనంలో తనపై జరిగిన లైంగిక దాడి గురించి వందలాది జనాల సమక్షంలో ధైర్యంగా ఆయన వివరించారు. ‘అప్పుడు నా వయసు తొమ్మిది లోపే ఉంటుంది. మా అపార్ట్మెంట్ లిఫ్ట్ ఎక్కాలంటే నాకు అప్పట్లో చచ్చేంత భయం. దానికి కారణం మా లిఫ్ట్ బోయ్. నేను ఆడుకోడానికి కిందకు వెళుతున్నప్పుడు లిఫ్ట్ లో వాడు, నేను ఇద్దరమే ఉండే వాళ్లం. దాన్ని అదనుగా తీసుకొని వాడు నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకేవాడు.
ఈ విషయంలో నేను చాలా సార్లు ఇబ్బంది పడ్డా. చివరకు తెగించేసి మా నాన్నకు చెప్పాను. వాడికి తగిన బుద్ధి చెప్పి వెంటనే పంపించేశారు’ అని గతాన్ని నెమరు వేసుకున్నారు అక్షయ్. ఇటీవల తన కుమారుని విషయంలో కూడా ఒకడు ఇలాగే ప్రవర్తిస్తే.. వాడ్ని పోలీసులకు పట్టించినట్లు కూడా ఈ సందర్భంలో అక్షయ్ గుర్తు చేసుకున్నారు. పిల్లల మనసులు సున్నితంగా ఉంటుందనీ, వారు అన్నీ చెప్పుకోలేరనీ.. వారి బాధను తల్లిదండ్రులే గ్రహించాలని అక్షయ్ పేర్కొన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
