Home

»

Latest News

అఖిల్ ఆడియోకి చీఫ్ గెస్ట్ గా గబ్బర్ సింగ్

Sep 16, 2015 11:15AM

నాగార్జున తనయుడు అఖిల్ లాంఛింగ్ మూవీ...‘అఖిల్‘ ఆడియో ఫంక్షన్ కోసం అక్కినేని అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.హీరో నితిన్... నిర్మాతగా మారి నిర్మిస్తున్న అఖిల్ సినిమా ఆడియో లాంఛ్ ను ఈ నెల 20న గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. హీరోగా అక్కినేని అఖిల్ లాంఛింగ్ మూవీ కావడంతో ఆడియో ఫంక్షన్ ను ధూంధాంగా చేయాలని చూస్తున్నారు. దాంతో తన అభిమాన హీరో అయిన పవన్ కల్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా రమ్మని నితిన్ కోరాడని చెబుతున్నారు. పవన్ వస్తే...ఆడియో ఫంక్షన్ కి మాంచి కిక్ వస్తుందని భావిస్తున్న నితిన్...పవర్ స్టార్ ను రిక్వెస్ట్ చేశాడట. మరోవైపు నాగార్జున కూడా పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి ఆహ్వానించారని, దాంతో తప్పకుండా పవన్... అఖిల్ ఆడియో ఫంక్షన్ కి వస్తాడని మెగా అభిమానులు సంబరపడుతున్నారు. అయితే తన సొంత ఫ్యామిలీ హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్లకే హాజరుకాని పవన్ కల్యాణ్... మరి నితిన్, నాగార్జున రిక్వెస్ట్ ను మన్నించి...అఖిల్ ఆడియో ఫంక్షన్ కి వస్తాడా...లేక డుమ్మా కొడతాడో చూడాలి

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com