Home

»

Latest News

షాకింగ్: లింగ మార్పిడి చేసుకున్న మెగా హీరోయిన్

May 04, 2017

మెగా కాంపౌండ్ లో అల్లు అర్జున్ సరసన సన్ ఆఫ్ సత్యమూర్తి, సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు చేసిన హీరోయిన్ అదా శర్మ లింగ మార్పిడి చేయించుకుంది. షాక్ అవ్వకండి. తాను నిజానికి, అంత గొప్ప సాహసం ఏం చేయలేదు. కానీ ఒక చిన్న తప్పిదం అంత అర్ధం వచ్చే పని చేసింది. ఫ్లయిట్ బుకింగ్ లో అదా శర్మ కి బదులుగా, మిస్టర్ అదా శర్మ అని పడింది. అక్కడికి ఈ అమ్మడు ఊరుకున్నా పోయేది. తాను లింగ మార్పిడి చేసుకుంటున్నట్లు, ఇప్పటి నుండి మిస్టర్ శర్మ అదా గా పిలవబడుతానని చెప్పుకొచ్చింది. ఇంతలోనే, తమాయించుకొని, ఇది జోక్ అని, బుకింగ్ సమయంలో జరిగిన తప్పు అని వివరించుకొచ్చింది. తాను ఇంకా ఈ విషయాన్నీ మర్చిపోలేక పోతున్నానని చెప్పింది. ఈ మధ్య చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అవడంతో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంది అదా. ఖాళీ గా ఉంది కదా ఇలా అందర్నీ ఆట పట్టించే ప్రయత్నం చేసింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com