Home

»

Latest News

షాకింగ్ : త్రిష బ్రేక‌ప్‌కి ధ‌నుష్ కార‌ణ‌మా?

May 7, 2015 1:07PM

త్రిష - వ‌రుణ్‌ల మ‌ధ్య అన్ అఫీషియ‌ల్‌గా బ్రేక‌ప్ జ‌రిగిపోయింది. నిశ్చితార్థానికి తూచ్ చెప్పేసి ఎవ‌రి దాళ్లు వాళ్లు చూసుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. మ‌రోవైపు త్రిష కూడా క్ర‌మంగా సినిమాల‌పై దృష్టి పెట్టింది. అయితే ఈ బ్రేక‌ప్‌కి కార‌ణం ఎవ‌రు?? త్రిష వ‌రుణ్ తో ఎందుకు గొడ‌వ ప‌డింది?? అనే విష‌యాల‌పై త‌మిళ చిత్ర రంగం ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటోంది. వీళ్ల బ్రేక‌ప్ కి ధ‌నుష్ కార‌ణమ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ధ‌నుష్‌, త్రిష మంచి స్నేహితులు. త్రిష - వ‌రుణ్‌లు జాయింటుగా నిర్వ‌హించిన ఓ పార్టీకి ధ‌నుష్ వ‌చ్చాడ‌ట‌. అక్క‌డ త్రిష ధ‌నుష్‌ని చ‌నువుగా ప‌ల‌క‌రించింద‌ట‌. వారిద్ద‌రి మ‌ధ్య ఈ రాపోని వరుణ్ త‌ట్టుకోలేక‌పోయాడ‌ని తెలుస్తోంది. ధ‌నుష్‌తో ఫ్రెండ్ షిప్ క‌ట్ చేసుకోమని త్రిష‌కు చాలాసార్లు స‌ర్దిచెప్పాడ‌ట‌.కానీ త్రిష వ‌రుణ్ మాట విన‌లేద‌ని తెలుస్తోంది. ఈ గొడ‌వ చినికి చినికి గాలివాన‌గా మారి బ్రేక‌ప్‌కి దారి తీసింద‌ని తెలుస్తోంది. ధ‌నుష్ తో మాత్ర‌మే కాదు, చాలామంది త‌మిళ హీరోల‌తో త్రిష‌కు ఫ్రెండ్ షిప్ ఉంది. అదీ.. వ‌రుణ్‌కి న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది. త్రిష మాత్రం వ‌రుణ్ నిర్ణ‌యాల‌కు త‌ల‌వొంచ‌కుండా - త‌న మ‌న‌సు చెప్పిన‌ట్టు న‌డుచుకొంద‌ని, ఇద్ద‌రూ ఇక‌పై క‌ల‌సి జీవించ‌డం క‌ష్ట‌మ‌నుకొన్న త‌ర‌వాతే.. ఓ అంగీకారానికి వ‌చ్చి విడిపోయార‌ని లేటెస్ట్ టాక్‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com