Home

»

Latest News

టాలీవుడ్ టాప్ టెన్ బాక్సాఫీస్ కలెక్షన్స్

Jul 10, 2011 7:06PM

టాలీవుడ్ టాప్ టెన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. వివరాల్లోకి వెళితే పదవ పోజిషన్ లో 28.1 కోట్లు వసూలు చేసి, ప్రభాస్ హీరోగా నటించిన "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ఉండాగా, ఒకటవ స్థానంలో రామ్ చరణ్ హీరోగా నటించిన "మగధీర" చిత్రం ఉంది. రెండవ స్థానంలో సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా నటించగా, శంకర్ సృష్టించిన సాంకేతిక సంచలనం "రోబో" ఉంది. మూడవ స్థానంలోప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన "పోకిరి" చిత్రముంది.

నాలుగవ స్థానంలో అనుష్క నటించిన "అరుంధతి" చిత్రం, అయిదవ స్థానంలో యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన "సింహా" చిత్రం, ఆరవ స్థానంలో జూనియర్ యన్ టి ఆర్ హీరోగా నటించిన "బృందావనం", ఏడవ స్థానంలోమెగాస్టార్ హీరోగా నటించిన "ఇంద్ర" చిత్రం, ఎనిమిదవ స్థానంలో జూ.యన్ టి ఆర్ హీరోగా నటించిన "యమదోంగ" చిత్రం" తొమ్మిదవ స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన "జల్సా" చిత్రం ఉండగా, పదవ పోజిషన్ లో ప్రభాస్ హీరోగా నటించిన "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ఉన్నాయి. వీటిలో ఒకటి నుండి అయిదు వరకూ ఉన్న చిత్రాలు 35 cr నుండి 75 cr వరకూ వసూలు చేశాయి. ఆరు నుండి పది వరకూ ఉన్న చిత్రాలు 25 cr నుండి 30 cr వరకూ వసూలు చేశాయని సినీ వర్గాలంటున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com