Home

»

Latest News

రామ్ చరణ్ కొత్త చిత్రానికి తమన్ సంగీతం

Jan 5, 2012 10:43AM

రామ్ చరణ్ కొత్త చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, అందాల సమంత హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఆ మధ్య అన్నపూర్ణ స్టుడియోస్ లో, హీరో తల్లి శ్రీమతి సురేఖ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యింది.

ఈ చిత్రానికే తమన్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ తొలిసారిగా ద్విపాత్రాభినయంలో నటించనున్నారు. మెగా ఫ్యామిలీలోని ఒక హీరోకి తమన్ సంగీతం అందించటం ఇదే తొలిసారి. ఈ చిత్రంతో తమన్ మెగా ఫ్యామిలీ చిత్రాల్లో పాగా వేసినట్టే.

ఈ చిత్రానికి ఆకుల శివ చక్కని కథనందించారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. సంపత్ నంది దర్శకత్వంలో, హీరో రామ్ చరణ్ ప్రస్తుతం "రచ్చ" చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ "రచ్చ" చిత్రం పూర్తి కాగానే వినాయక్ దర్శకత్వంలోని చిత్రం ప్రారంభమవుతుంది. ఈ నెలాఖరు నుండి ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com