Home

»

Latest News

సీనియర్ నటి వాణీశ్రీ పై చెప్పులు

Jun 2, 2012 2:05PM

సీనియర్ నటి వాణీశ్రీ పై చెప్పులు విసిరారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ నిన్న నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.సుబ్బిరామిరెడ్డి తరపున ఎన్నికల్లో ప్రచారం చేయటానికి వెళ్ళింది. అక్కడ మహిళ మీద ఏదో అసభ్యకరమైన లేదా అభ్యంతరకరమైన వ్యాఖ్యానం చేసిందట. దానికి అక్కడి స్థానిక మహిళలు ఆగ్రహించి ఆమెపై తమ చెప్పులను విసిరారట.

ఇంత అవమానం జరిగాక చేసేదేం లేక వాణీశ్రీ తన ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి వెనుదిరిగి వెళ్ళిపోయిందట. పూర్వం పెద్దలు ఒక మాట చెప్పేవారు. "బాబూ ఈ ఊరు మంచిదేనా" అని అడిగితే "నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిదే"అని.అదే జరిగింది వాణీశ్రీ విషయంలో...!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com