|
|
న్యూస్
|
|
"శకుని" ఆడియో రిలీజ్ |
| Jun 8, 2012 Telugu Cinema News : Like This : |
|
|
|
|
|
 |
|
|
"శకుని" చిత్రాన్ని, కార్తీ, ప్రణీత జంటగా నటించగా, తమిళంలో స్టుడియో గ్రీన్ పతాకంపై, జ్ఞానవేల్ నిర్మిస్తూండగా, తెలుగులో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ విడుదల చేస్తున్నారు. ఈ "శకుని" చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. జూన్ 8 వ తేదీన, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఉదయం 7.30 గంటలకు ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ల చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో రిలీజయ్యింది.
ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావుతో పాటు, ఈ చిత్ర హీరో, హీరోయిన్లు, పాటల రచయిత సాహితి, తమిళ, తెలుగు వెరషన్ల నిర్మాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహూతులందరూ ఈ చిత్రం ఆడియో అలాగే ఈ "శకుని" చిత్రం కూడా ఘనవిజయం సాధించాలని ఆశించారు. హీరో కార్టీ ప్రసంగిస్తూ ఇది ఒక పూర్తి వినోదాత్మక చిత్రమని అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఈ "శకుని" చిత్రాన్ని 450 థియేటర్లలో జూన్ 22 వ తేదీన విడుదల చేయనున్నామని తెలియజేశారు. |
|
|
| |
 |
|
|
|
|
|
|
 |
|
 |
|
|
|
| |
|
|
మహేష్ ప్రిన్స్ ఛార్మింగ్ - వెంకీ |
|
మహేష్ ప్రిన్స్ ఛార్మింగ్ అని వెంకీ అన్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ యువ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ "మహేష్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో ప్రిన్స్ ఛార్మింగ్" అని అన్నారు. |
| More » |
 |
|
వెంకీ "షాడో" కామెడీ ఎంటర్ టైనర్- కోన వెంకట్ |
|
వెంకీ "షాడో" కామెడీ ఎంటర్ టైనర్ అని ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ అన్నారు. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, తాప్సీ, రీచా గంగోపాథ్యాయ హీరోయిన్లుగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం"షాడో". |
| More » |
 |
|
వెంకీ "షాడో" ప్రారంభం |
|
వెంకీ "షాడో" ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, తాప్సి సెకండ్ హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం "షాడో". |
| More » |
 |
|
విక్టరీ వెంకటేష్ ఇంటర్ వ్యూ |
|
"కలియుగపాండవులు" చిత్రంతో సినీ తెరంగేట్రం చేసి, అర్థశతానికి పైగా చిత్రాల్లో నటించి, రాశి కన్నా వాసి మిన్న అని నమ్మిన హీరోగా, నటించిన ప్రతి చిత్రాన్నీ తొలి చిత్రమన్నంత జాగ్రత్తగా నటించబట్టే, డి.వెంకటేష్ కాస్తా "విక్టరీ" వెంకటేష్ అయ్యారు. ఆయనకు మహిళా అభిమానులు ఎక్కువంటే అతిశయోక్తి కాదు. |
| More » |
 |
|
"బాడీగార్డ్" సెన్సారు పూర్తి |
|
"బాడీగార్డ్" సెన్సారు పూర్తి అయ్యింది. వివరాల్లోకి వెళితే శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, మళయాళంలో సూపర్ హిట్టయిన "బాడీ గార్డ్" సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. |
| More » |
 |
|
|
|
|
|
|
|
|
|