Home

»

Latest News

పవన్ హీరోగా క్రిష్ చిత్రం...?

May 24, 2012 3:12PM

పవన్ హీరోగా క్రిష్ చిత్రం రానుందని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే ఇటీవల "గబ్బర్ సింగ్ ‍" సూపర్ హిట్టవటంతో మంచి ఊపు మీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "కెమెరామేన్ గంగతో రాంబాబు" అనే సినిమాలో నటించటానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్య క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా కలిశాడట.

దాంతో క్రిష్ పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాడనీ, త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ హీరోగా ఒక చిత్రం రానుందనే ఊహాగానాలు ఫిలింనగర్ లోపుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం రానా హీరోగా "కృష్ణం వందే జగద్గురుం" అనే చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. "కెమెరామేన్ గంగతో రాంబాబు","కృష్ణం వందే జగద్గురుం" చిత్రాలు పూర్తయ్యాక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఉండే చిత్రం ప్రారంభం కావచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com