Home

»

Latest News

స‌మంత కాద‌ని... త‌మ‌న్నాతో..

Apr 25, 2015

చిత్ర‌సీమ‌లో ఎవ‌రి ప్లేసుకీ గ్యారెంటీ లేదు. హీరోయిన్‌గా ఒక‌రి అనుకొంటారు.. చివ‌రి నిమిషాల్లో మ‌రో క‌థానాయిక వ‌చ్చి ఆమె స్థానాన్ని ఆక్ర‌మిస్తుంటుంది. ఇప్పుడ‌లానే స‌మంత స్థానాన్ని ఎగ‌రేసుకుపోయింది త‌మ‌న్నా. నాగ‌చైత‌న్య - చందూ మొండేటి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇందులో క‌థానాయిక‌గా స‌మంత‌ని అనుకొన్నారు. ఏమాయ చేశావె, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నంతో ఈ జంట హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పుడు నాలుగో సారి రొమాన్స్ చేసుకొంటారు అనుకొన్నారు. అయితే స‌మంత‌కి త‌మన్నా ఎస‌రు పెట్టింది. ఈ సినిమా కోసం స‌మంత‌ని ప‌క్క‌న పెట్టి త‌మ‌న్నాని ఎంపిక చేశార‌న‌టి టాక్‌. '100 % ల‌వ్‌', 'త‌డాఖా' చిత్రాల్లో చైతూ - త‌మ‌న్నాల కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరింది. ఈ సినిమాతో వీళ్లిద్ద‌రూ హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నార‌న్న‌మాట‌. స‌మంత‌ని ఎందుకు ప‌క్క‌న పెట్టారో, ఆ స్థానంలో త‌మ‌న్నాని ఎందుకు తీసుకొన్నారో కార‌ణాలు తెలియ‌రాలేదు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com