Home

»

Latest News

మెగా సుప్రిం హీరో త‌యార‌య్యాడు

Mar 18, 2015 10:34AM

ఒక‌ట్రెండు సినిమాలు చేస్తే చాలు... హీరోల‌కు బిరుదులు త‌గిలించేయ‌డం కామన్ అయిపోయింది. అందునా వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చిన హీరోలైతే వ‌స్తూ వ‌స్తూనే ఓ బిరుదు త‌గిలించుకొని వ‌చ్చేస్తున్నారు. మెగా హీరోలు పుట్ట‌డంతోనే బిరుదుల‌తో పుడ‌తారు. చిరంజీవి ఎప్ప‌టికోగానీ మెగాస్టార్ కాలేదు. ప‌వ‌న్‌ని ప‌వ‌ర్‌స్టార్ అని పిల‌వ‌డానికి కూడా చాలా కాలం ప‌ట్టింది. అయితే ఆ త‌ర‌వాత వ‌చ్చిన స్టార్లంతా.. రెడీమెడ్‌గా స్టారిజం తెచ్చుకొన్న‌వాళ్లే. రామ్‌చ‌ర‌ణ్ మెగాప‌వర్‌స్టార్ అయ్యాడు. బ‌న్నీ స్టైలీష్ స్టార్‌గా అవ‌త‌రించాడు. ఇప్పుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌కీ ఓ బిరుదు త‌గిలించారు. అదే.. మెగా సుప్రింహీరో అని. చిరంజీవిని మెగాస్టార్ అంటారు.. అంత‌కు ముందు ఆయ‌న‌కు సుప్రింహీరో అనే బిరుదుండేది. అలా.. ఆయ‌న మేన‌ల్లుడు మెగా సుప్రిం హీరో అయ్యాడ‌న్న‌మాట‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com