"సూపర్ రాజా" అవుతున్న సునీల్ అంటే అదే సునీల్ హీరోగా నటిస్తున్న సినిమా అనుకునేరు. కాదండీ బాబూ...! "సూపర్ రాజా" అనేది సునీల్ కి వచ్చిన కొత్త టైటిల్ అట. అంటే చిరంజీవికి మెగాస్టార్, పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్, నాగార్జునకి యువసామ్రాట్, బాలకృష్ణకి యువరత్న, వెంకటేష్ కి విక్టరీ, రవితేజకి "మాస్ మహరాజా", అల్లరి నరేష్ కి "మాస్ రాజా", అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్, రామ్ చరణ్ కి మెగాపవర్ స్టార్ వంటి బిరుదులు ఎలాగున్నాయో, అలాగే సిక్స్ ప్యాక్ సునీల్ కి కూడా ఈ "సూపర్ రాజా" అనే బిరుదుని "పూలరంగడు" చిత్రంలో దర్శకుడు వీరభద్రం చౌదరి టైటిల్స్ లో వేస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. సో ఇక నుంచీ సునీల్ మామూలు సునీల్ కాదన్నమాట. సునీల్ బాబు పేరు ముందు "సూపర్ రాజా" సునీల్ బాబు అని వ్రాయాలి కాబోలు...!
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ..."సూపర్ రాజా" అవుతున్న సునీల్
Feb 2, 2012 11:12AM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




