Home

»

Latest News

ప్రభాస్ హీరోగా సుకుమార్ సినిమా

Jun 14, 2011 10:43AM

ప్రభాస్ హీరోగా సుకుమార్ సినిమా తీయబోతున్నాడని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఇటీవల గీతా ఆర్ట్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, బన్నీ వాసు నిర్మించిన "100%లవ్" సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా సూపర్ హిట్టయ్యింది.

ఈ సినిమా హిట్టయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "జోకర్" అనే సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తారని ముందుగా వినపడినా, ఆ తర్వాత ఆ ప్రోజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారమందింది. ప్రస్తుతం "మిస్టర్ పర్ ఫెక్ట్" సినిమా హిట్టవటంతో మంచి ఊపు మీదున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుకుమార్ ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారని ఫిలింనగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ ని దర్శకుడు సుకుమార్ ఒక విభిన్నకోణంలో లవర్ బోయ్ గా చూపించబోతున్నారని తెలిసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com