Home

»

Latest News

ఆగస్ట్ 15 న బాలకృష్ణ శ్రీరామరాజ్యం ఆడియో రిలీజ్

Jul 5, 2011 3:59PM

ఆగస్ట్ 15 న బాలకృష్ణ "శ్రీ రామరాజ్యం" ఆడియో రిలీజ్ కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే నందమూరి నట సింహం, యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరామ చంద్ర మూర్తిగా, అందాల నయనతార సీతా మహా సాధ్విగా, లక్ష్మణుడిగా శ్రీకాంత్,‍ భరతుడిగా సాయికుమార్, వాల్మీకిగా మహానటులు నటసామ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా నటిస్తూండగా, బాపుగారి దర్శకత్వంలో, యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న గొప్ప పౌరాణిక కళాఖండం "శ్రీ రామ రాజ్యం". బాలకృష్ణ "శ్రీ రామరాజ్యం" సినిమాకి ఇసై (తమిళంలో సంగీతం అని అర్థం)రాజా ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

బాలకృష్ణ "శ్రీ రామరాజ్యం" సినిమా టీజర్ ని బాలకృష్ణ జన్మదినం సందర్భంగా విడుదల చేయగా, దానికి అద్భుతమైన స్పందన లభించింది. బాలకృష్ణ "శ్రీ రామరాజ్యం" ఆడియోని మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 వ తేదీన భద్రాచలంలో, సీతాదేవీ సమేత శ్రీరామచంద్రుని సమక్షంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు. ఈ బాలకృష్ణ "శ్రీ రామరాజ్యం" చిత్రాన్ని ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలను రచించిన ఘన రచయిత స్వర్గీయ శ్రీ ముళ్ళపూడి వేంకటరమణగారికి అంకితమివ్వటం ముదావహం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com