Home

»

Latest News

"ఎవడు" రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 23 నుండి

Feb 6, 2012 3:04PM

"ఎవడు" రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, సమంత, ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "ఎవడు".ఈ "ఎవడు" చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రం షూటింగ్ ను ఆస్ట్రేలియాలో, బ్రెజిల్ దేశాల్లో కల అందమైన లొకేషన్లలో జరిపేందుకు ఈ "ఎవడు" చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తూంది.

ఈ "ఎవడు" చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ పోలీసాఫీసర్లట. విలన్లతో జరిగే ఒక పోరాటంలో అల్లు అర్జున్ చనిపోగా, రామ్ చరణ్ మెదడు దెబ్బతింటే అల్లు అర్జున్ మెదడుని రామ్ చరణ్ కి పెట్టి విలన్ల ఆట కట్టిస్తారని ఈ చిత్రం కథ గురించి ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com