Home

»

Latest News

పవన్ కళ్యాణ్ సినిమా షుటింగ్ లో రాజమౌళి

May 22, 2011 5:55PM

పవన్ కళ్యాణ్ సినిమా షుటింగ్ లో రాజమౌళి కనపడ్డాడు. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అంజలీ లావణ్య, సార జేన్ దియాస్, అడవిశేష్, జాకీ ష్రాఫ్ ప్రథాన తారాగణంగా, ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"ది షాడో". పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమా షూటింగ్ కలకత్తా మహానగరంలో ఇటీవల ప్రారంభమై, శరవేగంగా జరుగుతోంది.

దానికీ రాజమౌళికీ సంబంధం ఏంటనేగా మీ అనుమానం...? విషయమేమిటంటే కలకత్తా కాళీ దేవాలయాన్ని దర్శించుకునేందుకు రాజమౌళి కలకత్తాకి వెళ్ళారు. తీరా ఇక్కడి వరకూ వచ్చామ కదాని పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమా షూటింగ్ కూడా పనిలో పనిగా చూద్దామని అక్కడికి రాజమౌళి వెళ్ళాడు. కానీ అప్పుడు జరుగుతున్న షూటింగులో హీరో పవన్ కళ్యాణ్ పాత్ర లేకపోవటంతో రాజమౌళి ఆ చిత్రం యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి హ్యాపీగా తిరిగి వచ్చాడు. అదీ సంగతి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com