Home

»

Latest News

అనుష్కతో రాజమౌళి ఓరుగల్లు రుద్రమ్మ

Apr 20, 2011 9:31AM

అనుష్కతో రాజమౌళి "ఓరుగల్లు రుద్రమ్మ" అనే చిత్రాన్ని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలిసిన విషయం. వివరాల్లోకి వెళితే అపజయమెరుగని, డైనమిక్ యువ దర్శకుడు యస్.యస్.రాజమౌళి "ఓరుగల్లు రుద్రమ్మ" అనే ఒక స్త్రీ ప్రథానమైన చిత్రానికి శ్రీకారం చుడుతున్నారట.

anushka hot wallpapers, anushka hot stills, anushka hot images, anushka hot pics, anushka hot  photos, anushka hot pictures

ఈ రాజమౌళి "ఓరుగల్లు రుద్రమ్మ"చిత్రంలో టైటిల్ పాత్రలో ప్రముఖ హీరోయిన్ అందాల యోగా టీచర్ అనుష్క నటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. అయితే ఇది సాంఘీక చిత్రమా లేక చారిత్రాత్మక చిత్రమా అనేది ఇంకా తెలియరాలేదు.

 

రాజమౌళి వంటి దర్శకుడు చారిత్రాత్మక చిత్రంగానే ఈ "ఓరుగల్లు రుద్రమ్మ" అనే ఇంతటి శక్తివంతమైన పేరుని తీసే అవకాశాలు బలంగా ఉన్నాయని అనుకోవచ్చు. అదే నిజమైతే కాకతీయుల కాలం నాటి రాణి రుద్రమదేవి చరిత్రనే ఈ "ఓరుగల్లు రుద్రమ్మ" చిత్రంగా రాజమౌళి మలచే అవకాశాలున్నాయి.

 

అదే జరిగితే అనుష్కకు ఈ రాజమౌళి "ఓరుగల్లు రుద్రమ్మ" చిత్రంలోని పాత్ర "అరుంధతి" చిత్రంలోని పాత్రకన్నాగొప్ప పాత్రవుతుందనీ, "ఓరుగల్లు రుద్రమ్మ" చిత్రం "అరుంధతి" చిత్రంకన్నా గొప్ప చిత్రమవుతుందని సినీ పండితులంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి "ఈగ" ఆ తర్వాత ప్రభాస్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలూ పుర్తయ్యాక ఈ రాజమౌళి "ఓరుగల్లు రుద్రమ్మ" చిత్రం మొదలయ్యే అవకాశాలున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com