చౌదరికి చురకేసేశాడు!
on Apr 7, 2015

ఆర్. నారాయణమూర్తి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆయన అసలే రెబల్‌స్టార్. మనిషిని ఎదురుగా పెట్టుకొని వాళ్లపై సెటర్లు వేయడానికి కూడా సిద్ధపడతారు. అలాంటి సెటైరే వైవిఎస్ చౌదరిపైనా పడిపోయింది. రేయ్ ప్రమోషన్లలో ఆర్. నారాయణ మూర్తి కూడా కనిపిస్తున్నాడు. చౌదరికి నారాయణమూర్తి అంటే అభిమానం ఎక్కువ. అందుకే.. రేయ్ ప్రెస్‌మీట్లలో నారాయణ మూర్తి హాజరు కూడా తప్పని సరి. ఈమధ్యే రేయ్ సక్సెస్‌మీట్ జరిగింది. సభలో.. నారాయణమూర్తి ఆవేశంగా మాట్లాడాడు. వైవిఎస్ చౌదరి కృషి, పట్టుదల మెచ్చుకొన్నాడు. అయితే.. చివర్లో కొసమెరుపుగా ఓ చురకా వేశాడు. ''బ్రదరూ... నీ సినిమాలో బూతులున్నాయి.కాస్త తగ్గించుకో..'' అన్నాడు. దాంతో వైవిఎస్ చౌదరికి షాక్ తగిలింది. ఆ పక్కనే ఈ చిత్రానికి మాటలు రాసిన శ్రీధర్ సిపాన కూడా ఉన్నాడు. రెడ్ స్టార్ మాటలు ఆయనకూ బాగా తగిలాయి..! మొత్తానికి సక్సెస్ మీట్‌కి వెళ్లి.. వాళ్ల గాలి తీసొచ్చాడు నారాయణ మూర్తి. వెరైటీ అంటే ఇదే కదా..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



