Home

»

Latest News

సునీల్ "పూలరంగడు" ఫిబ్రవరి ౩ న రిలీజ్

Jan 5, 2012 11:02AM

సునీల్ "పూలరంగడు" ఫిబ్రవరి ౩ న రిలీజ్ అవుతుందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ డాక్టర్ వెంకట్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సిక్స్ ప్యాక్ సునీల్ హీరోగా, "ప్రేమకావాలి" ఫేం ఇషా చావ్లా హీరోయిన్ గా, "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నవిభిన్నకథా వినోదాత్మక చిత్రం "పూలరంగడు".

ఈ సునీల్ "పూలరంగడు" చిత్రంలో హీరో సునీల్ ఆశ్చర్యకరంగా సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులకు కనువిందుగా కనిపించనున్నాడు. సునీల్ డ్యాన్సులు ఇరగదీస్తాడనే సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ సీన్లలో కూడా అదరగొడతాడనే అంచనాలు సునీల్ పై నెలకొన్నాయి.

ఇక దర్శకుడు వూరభద్రం చౌదరి తొలి చిత్రం ఘనవిజయం సాధించటంతో ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.సునీల్ "పూలరంగడు" చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం చాలా బాగుందని ఇప్పటికే సినీ వర్గాలంటున్నాయి. ఈ సునీల్ "పూలరంగడు" చిత్రం ముందుగా అనుకున్నట్టు సంక్రాంతికి కాకుండా ఫిబ్రవరి 3 వ తేదీన విడుదలవుతుందని తెలిసింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com