Home

»

Latest News

ఫిబ్రవరి 10 న రానున్న "పూలరంగడు"

Jan 20, 2012 9:32AM

ఫిబ్రవరి 10 న రానున్న "పూలరంగడు"అని సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ డాక్టర్ వెంకట్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సిక్స్ ప్యాక్ సునీల్ హీరోగా, ఇషా చావ్లా హీరోయిన్ గా, "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం" పూలరంగడు". ఈ "పూలరంగడు చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఇటీవల విడుదలైన ఈ "పూలరంగడు" చిత్రం ఆడియోకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తుంది.

ఈ చిత్రం ఆడియో ఇప్పటికే సూపర్ హిట్టయ్యింది. ఈ "పూలరంగడు" చిత్రాన్ని ఫిబ్రవరి 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో హీరో సునీల్ పాటల్లో డ్యాన్స్, యాక్షన్ సీన్లలో ఫైట్లు ఇరగదీశాడని సినీ జనం అంటున్నారు. వీరభద్రం చౌదరి దర్శకత్వ ప్రతిభకు హీరో సునీల్ నటనా ప్రతిభ కూడా తోడైతే ఈ సినిమా కచ్చితంగా హిట్టేనని సినీ జనం అంటున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com