Home

»

Latest News

సీక్వెల్స్ తెలుగుసినిమాకి అచ్చిరావా....!

Jul 15, 2011 4:18PM

సీక్వెల్స్ తెలుగుసినిమాకి అచ్చిరావా....! అంటే కలసి రావట్లేదనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఒక విషయం చేప్పాలి "హ్యారీ పోట్టర్" సినిమాకి సీక్వెల్ గా ఏడు సినిమాలు విడుదలయ్యాయి..ఏడూ కూడా సూపర్ హిట్టయ్యాయి...అలాగే "జేమ్స్ బాండ్" సిరీస్ కూడా సూపర్ హిట్టయ్యాయి. వాళ్ళు అవి హిట్టవటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు......అందుకు అవసరమైన సమయాన్ని కూడా తీసుకుంటారు...

రి మనవాళ్ళు తీసిన సీక్వెల్స్ ఎందుకని ఫ్లాపవుతున్నాయి. కారణాలేమిటనేది మనవాళ్ళెప్పుడూ ఆలోచించరు కదా...వొళ్ళో పెట్టనా...దళ్ళొ పెట్టనా...అన్న హడావుడితో సినిమా తీస్తే సినిమాలు ఫ్లాప్ కాక ఛస్తాయా...? ఉదాహరణకు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "ఆర్య" సూపర్ హిట్టయ్యింది. కానీ అదే కాంబినేషన్ లో వచ్చిన "ఆర్య-2" సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు...

అలాగే రజనీకాంత్ నటించిన సూపర్ హిట్‍ చిత్రం "చంద్రముఖి" చిత్రానికి సీక్వెల్ గా విక్టరీ వెంకటేష్ హీరోగా తీసిన "నాగవల్లి" ఫ్లాపయ్యింది. ఇవి పక్కన పెడితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, మాస్ రాజా రవితేజ హీరోగా నటించనున్న "ఇడియట్-2" చిత్రం ఈ సిక్వెల్ ఫ్లాపుల రికార్డుని అధిగమిస్తుందేమో వేచి చూడాలి...

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com