Home

»

Latest News

సమంతకి అంబులెన్స్ ఎందుకు?

Jun 03, 2015

సమంతకేమైంది? కాంట్రవర్సీ లేకుండా నిద్రపట్టదా? అన్నింట్లోనూ తగుదునమ్మా అని ఎందుకు తయారైపోతుంది? టాలీవుడ్ లో అమ్మడిపై వినిపిస్తున్న రుసరుసలివి. గతంలో మహేశ్ బాబు సినిమాలో హీరోయిన్ ని కుక్కలా చూపించారంది. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కి వెళ్లాలంటే బోర్ అంది. అంజాన్ పోస్టర్లో తననెందుకు చూపించలేదని హడావుడి చేసింది. ఇలా ప్రతివిషయంపై ఎదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఇంతకీ రీసెంట్ గొడవ ఏంటంటే....బాహుబలి ట్రైలర్ చూసి మైండ్ బ్లోయింగ్ అంది. ఇందులో తప్పేముందంటారా? అక్కడితో ఆగి ఉంటే సరిపోయేది కానీ.....మైండ్ బ్లోయింగ్-స్టిల్ బ్లోయింగ్- అంబులెన్స్ కి కాల్ చేయండి అంది. దీంతో క్యూట్ గాళ్ ఉద్దేశం ఏంటో అర్థకావడం లేదంటున్నారు. మొత్తం మీద ప్రభాస్, రాజమౌళి ఫ్యాన్స్ మాత్రం అమ్మడిపై గుర్రుగా ఉన్నారట. మరి కామెంట్స్ పై వెంటనే రియాక్ట్ అయ్యే సమ్మూ ఏం సమాధానం చెబుతుందో చూద్దాం!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com