ముదురు బ్యూటీపై చిరు మోజు
on Apr 23, 2015
.jpg)
ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నాడట వెనుకటికొకడు. మెగస్టార్ చిరంజీవి తీరు చూస్తుంటే ఇప్పుడిలానే ఉంది. పాలిటిక్స్ లో జోకర్ అయిపోయిన మెగాస్టార్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటా అని ముచ్చటపడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అనడమే కానీ క్లారిటీ లేదు. పూరీ, వినాయక్, శంకర్, త్రివిక్రమ్ ఇలా చాలామంది దర్శకుల పేర్లు బయటకొచ్చాయి. కానీ కథా ఫైనలవలేదు. దర్శకుడెవరో డిసైడ్ అవలేదు. ఇంతలో అతిలోకసుందరిపై చిరు మోజుపడుతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముదురు వయసులోనూ సొగసుకాడలా కనిపించాలని ముచ్చటపడే శ్రీదేవి కూడా..హీరోయిన్ గా అనగానే సరే అందట. అయితే చిరు అడగాలే కానీ కాజల్ కాదంటుందా? నయన్ వద్దంటుందా? త్రిష పొమ్మంటుందా?శ్రియ రానుంటుందా? చివరికి సమంతా, శ్రుతి కూడా సై అంటారు. మరి వీళ్లందర్నీ వదిలేసి ముసలి హీరోయిన్ పై ఈ ముదురు హీరో ఎందుకు మోజు పడ్డాడా అనే డిస్కషన్ జోరందుకుంది. అప్పుడెప్పుడో జగదేకవీరుడు-అతిలోక సుందరి హిట్టైంది కదా అని ఆలోచిస్తే.....మొదటికే మోసం వస్తుందేమో అంటున్నారు. అయినా ఏదో ఫ్లాష్ బ్యాక్ సీన్ లో శ్రీ ఉంటే సరే కానీ....సినిమా మొత్తానికి ఈమే హీరోయిన్ అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



