Home

»

Latest News

'జిల్లా' రీమేక్ లో వెంకటేష్‌, రవితేజ

Mar 05, 2015

ఇప్పటికే మహేష్‌, రామ్‌, తాజాగా పవన్‌కళ్యాణ్ తో మల్టీస్టారర్‌ సినిమాలలో నటించిన విక్టరీ వెంకటేష్‌ మరో మల్టీస్టారర్‌ సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సారి మాస్‌ మహారాజాతో కలిసి వెండితెరను పంచుకున్నాడు. దర్శకుడు వీరు పోట్ల వీరిద్దరి కాంబో కోసం కొన్ని స్టోరీ లైన్స్ అనుకున్నా… ఫైనల్‌గా ఇపుడు ఓ తమిళ్ సూపర్ హిట్ రీమేక్ ఓకే అయిందని లేటెస్ట్ న్యూస్. 2014 పొంగల్‌కు విడుదలై తమిళ్‌లో సూపర్ హిట్ కొట్టిన ” జిల్లా ” మూవీ రీమేక్‌లో వీరిద్దరూ నటిస్తారని టాక్. తమిళ్‌లో మోహన్ లాల్, విజయ్, కాజల్ నటించిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ ఆదరణతో సూపర్ హిట్ సాధించింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ మూవీ డీటైల్స్ త్వరలో ఆఫీషియల్‌గా అనౌన్స్ అవుతాయని టాక్.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com