ప్రిన్స్ మహేష్ "ఆగడు"..వివరాల్లోకి వెళితే టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో నిర్మించబోయే చిత్రానికి "ఆగడు" అన్న పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరో ప్రిన్స్ మహేష్ బాబు సరికొత్తగా కనిపించనున్నారని సమాచారం.
అందుకోసం ఆయన హాలీవుడ్ నుండి ఒక ఫిజికల్ ట్రైనర ని పిలిపించుకుని, ముఖంలో గ్లామర్ దెబ్బతినకుండా సిక్స్ ప్యాక్ బాడీ కోసం కసరత్తులు చేస్తున్నాడట. ఈ "ఆగడు" చిత్రం జూన్ లో ప్రారంభం కానుంది. మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంలో విక్టరీ వెంకటేష్ తో కలసి నటిస్తున్నాడు.




