Home

»

Latest News

నాగ్ సరసన మళ్ళీ నయనతార

Jan 24, 2012 1:15PM

నాగ్ సరసన మళ్ళీ నయనతార హీరోయిన్ గా నటించబోతూందని తెలిసింది. వివరాల్లోకి వెళితే గతంలో కింగ్ నాగార్జున సరసన "బాస్" చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. తర్వాత అదే నిర్మాత అంటే కామాక్షీ కళా మూవీస్ అధినేత డి.శివప్రాసాదరెడ్డి నిర్మించబోతున్న చిత్రంలో కూడా నాగార్జున సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తూందని సమాచారం. ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహించనున్నారు. మార్చి నుండి ఈ చిత్రం ప్రారంభమవుతుంది.

గతంలో నాగార్జున హీరోగా నటించిన "సంతోషం" చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహించారు. యువరత్న నందమూరి బాలకృష్ణ సరసన "శ్రీరామరాజ్యం" చిత్రంలో నటించిన నయనతార ఇక సినిమాల్లో నటించదని అందరూ అనుకుంటున్న సమయంలో నాగార్జున హీరోగా నటించబోయే ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించటం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com