Home

»

Latest News

మహేష్ ప్రిన్స్ ఛార్మింగ్ - వెంకీ

Feb 2, 2012 10:31AM

మహేష్ ప్రిన్స్ ఛార్మింగ్ అని వెంకీ అన్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ యువ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ "మహేష్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో ప్రిన్స్ ఛార్మింగ్" అని అన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, విక్టరీ వేంకటేష్, అంజలి జంటగా, ప్రిన్స్ మహేష్ బాబు, సమంత మరోజంటగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న "సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు".

ఈ "సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు" చిత్రంలో మహేష్ బాబుతో నటించటానికి చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాననీ, "దూకుడు", "బిజినెస్ మ్యాన్" వంటి బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్లిచ్చిన మహేష్ బాబు ప్రిన్స్ ఛార్మింగ్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనీ వేంకటేష్ అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com