Home

»

Latest News

ముంబాయిలో కాజల్ సేల్స్ గర్ల్ -భారతీ రాజా

Jul 9, 2011 7:47AM

ముంబాయిలో కాజల్ సేల్స్ గర్ల్ అని ప్రముఖ దర్శకులు భారతీ రాజా అన్నారు. వివరాల్లోకి వెళితే ఒక సందర్భంలో "నన్ను సౌతిండియన్ అని పిలవకండి. మాది ముంబాయి" అని దక్షిణాది సినీ పరిశ్రమను కించపరిచిన కాజల్ అగర్వాల్ కు నటన నేర్పించి, పట్టెడన్నం పెట్టింది మాత్రం దక్షిణాది సినీ పరిశ్రమేనన్న సంగతి ఆ పిల్ల మరచిపోయింది.

ఈ విషయం గురించి ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మాట్లాడుతూ " కాజల్ అగర్వాల్ ముంబాయిలో ఒక టెక్స్ టైల్ షాప్ లో జస్ట్ సేల్స్ గర్ల్ మాత్రమే. ఆమెను నా బొమ్మలాట్టం సినిమాలో తీసుకుని నటన నేర్పించి, డ్యాన్స్ నేర్పించి, ఎన్నో బాధలు పడితే ఈ రోజున ఈ స్థితిలో ఉంది. ఆమెకి ముట్టె పొగరు కూడా బాగాఎక్కువే. కానీ నా సినిమా పూర్తిచేయటం కోసం అవన్నీ భరించాను. ఆమె ఇక్కడి సినీ పరిశ్రమలో పేరు, డబ్బు సంపాదించుకుని ఈ సినీ పరిశ్రమనే అవమానించటం చాలా దారుణమైన విషయం. దీని మీద అవసరమైన చర్యలు తీసుకుని ఆమెపై సరైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరముంది" అని అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com