Home

»

Latest News

అసలేం జరుగుతోంది - కాజల్ అగర్వాల్

Jun 23, 2011 9:09PM

"అసలేం జరుగుతోంది" అని కాజల్ అగర్వాల్ అంటూంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ పై సౌతిండియన్ సినిమా వారు బ్యాన్ పెట్టబోతున్నారట. మొన్నామధ్య సినీ నటి కాజల్ అగర్వాల్ "సింఘం" అనే ఒక హిందీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో దక్షిణాది సినిమా వారిని మీడియాలో కించపరిచే విధంగా మాట్లాడిందనీ, అందుకామె మీడియాకు క్షమాపణ చెప్పాలనీ, లేకుంటే ఆమె దక్షిణాది సినిమాల్లో నటించటానికి వీల్లేదనీ వినపడింది. నిజానికి కాజల్ అగర్వాల్ సినీ నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది బాలీవుడ్ లోనే అయినా ఆమె నటనంటే నేర్చుకుందీ, పేరు ప్రఖ్యాతులూ, డబ్బూ సంపాదించుకుంది మాత్రం దక్షిణాది సినిమాల్లోనే అనే సంగతి అందరికీ తెలిసిందే.

ఆమె ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. అలాంటిది కాజల్ అగర్వాల్ దక్షిణాది సినీపరిశ్రమపైనే విమర్శనాస్త్రాలను సంధించటం మనవాళ్ళకి మింగుడుపడలేదు. ఈ విషయంపై ప్రముఖ తమిళ హీరో సూర్య కూడా ఘాటుగా స్పందించాడు. ఏ సినీ పరిశ్రమ పైకి తెచ్చిందో మర్చిపోయి, ఒక్క సినిమా అవకాశం రాగానే బాలీవుడ్ ని పొగుడుతూ, సౌతిండియన్ సినీ పరిశ్రమను విమర్శించటం కాజల్ కు భావ్యం కాదని ఆయన అన్నారు. ఇవన్నీ విన్న తర్వాత కాజల్ స్పందిస్తూ "అసలేం జరుగుతోంది. నేనేమన్నానూ...మీడియా ఏం రాసింది. అన్నది తెలుసుకోకుండా నాపై విమర్శలు కురిపించటం భావ్యం కాదు" అని ఆమె అంటూంది. నిలకడ మీద కదా నిజం తెలిసేది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com