Home

»

Latest News

త్వరలో డైరెక్ట్ తెలుగు ఫిలిం చేస్తా- జీవా

Jul 21, 2011 12:57PM

త్వరలో డైరెక్ట్ తెలుగు ఫిలిం చేస్తానని "రంగం" హీరో జీవా అన్నాడు. వివరాల్లోకి వెళితే ఈ మధ్య తమిళ, తెలుగు భాషల్లో విడుదలై విజయం సాధించిన "రంగం" సినిమాలో హీరోగా నటించాడు జీవా. ఈ జీవా మరెవరో కాదు సూపర్ గుడ్ ఫిలిం స్ అధినేత ప్రముఖ నిర్మాత అయిన ఆర్.బి.చౌదరి కుమారుడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో తాను కూడా టాలీవుడ్ లో యువ హీరోలకు పోటీగా మారాలనుకుంటున్నాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా ఈ మధ్య తాను త్వరలో ఒక స్ట్రైట్ తెలుగు సినిమాలో నటిస్తానని ఒక స్టేట్ మెంటిచ్చాడు. యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఇద్దరూ ఆర్.బి.చౌదరికి అనుంగు శిష్యులు అన్నది ప్రేక్షకులకు తెలిసిందే. తమ గురువు గారి కుమారుడు కావటం వలన జీవా నటించబోయే తెలుగు సినిమాకి అవసరమైన అన్ని హంగులూ సమకూర్చటానికి సిద్ధంగా ఉన్నారు. మంచి కథ దొరికితే, దాన్ని చక్కగా తెరమీద చూపించగల దర్శకుడితో సినిమా తీయగల సత్తా వారిద్దరికీ ఉంది మరి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com