Home

»

Latest News

మహాభారతం తీయాలనుంది- రాజమౌళి

Jul 16, 2011 7:06PM

మహాభారతం తీయాలనుంది అని రాజమౌళి అంటున్నాడట. వివరాల్లోకి వెళితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం "స్టూడెంట్ నంబర్ 1" నుండి ఇటీవల వచ్చిన "మర్యాదరామన్న" చిత్రం వరకూ ప్రతి సినిమా సూపర్ డ్యూపర్ హిట్టయ్యిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగ నటించిన "మగధీర" చిత్రం అయితే తెలుగు సినిమా ప్రతిష్టను ఆకాశానికి ఎత్తేసింది.

 

ప్రస్తుతం రాజమౌళి "ఈగ" అనే ప్రయోగాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాంటి రాజమౌళి తనకు "మహా భారతం"
సినిమాగా తీయాలనుందని అంటున్నాడు. యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరో గా "దాన వీర శూర కర్ణ" చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తారని వినపడుతున్న నేపథ్యంలో రాజమౌళి ఈ విధంగా ప్రకటించటం విశేషం. ఇలా మహా భారతాన్ని
సినిమాగా తీయటానికి తనకు కనీసం మూడు నాలుగేళ్ళు పడుతుందనీ, ఎందుకంటే అందుకవసరమైన రీసెర్చ్ చాలా చెయ్యాల్సి
ఉంటుందనీ ఆయన అన్నారు.    

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com