Home

»

Latest News

బన్నీ చిత్రంలో హాలీవుడ్ తరహా దోపిడీ

Jan 21, 2012 6:43PM

బన్నీ చిత్రంలో హాలీవుడ్ తరహా దోపిడీ సీనుందట. వివరాల్లోకి వెళితే ప్రముఖ నిర్మాట డి.వి.వి.దానయ్య సమర్పణలో, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నలకనడుము గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, యన్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో హాలీవుడ్ తరహా దోపిడీ సీనుందట. ఈ సీన్ ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా బాగా తీశాడని అంటున్నారు. ఈ సినిమాకి "పార్ట్ నర్" అన్న పేరు పెట్టే ఆలోచనలో ఈ చిత్రం యూనిట్ ఉందని సమాచారం.

గతంలో ఈ చిత్రానికి "హనీ" అన్న పేరు పెట్టినట్లు రూమర్ వినపడింది. కానీ అది నిజం కాదని ఈ చిత్రం యూనిట్ క్లియర్ చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా హిట్టవటం హీరోకీ, హీరోయిన్ కీ, దర్శకుడికీ అత్యంత ముఖ్యమన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com