Home

»

Latest News

ఎక్స్ క్లూజివ్: 'మే'లో సెట్స్ పైకి గ‌బ్బర్ సి౦గ్

Apr 16, 2015 9:41AM


రెండేళ్లుగా గ‌బ్బర్ సింగ్ 2 సినిమా విష‌యంలో నిరీక్షణ‌లో పెట్టేశాడు పవ‌న్ కళ్యాణ్‌. సంప‌త్‌నంది స్థానంలో బాబి కూడా వ‌చ్చాడు. అయినా సినిమా స్టార్ట్ అవ్వలేదు. దాంతో గ‌బ్బ‌ర్ సింగ్ 2 ఉంటుందా, లేదా? అనే విష‌యంపై అనుమానాలు పెరిగిపోయాయి. గ‌బ్బర్ సింగ్ 2ని దాదాపుగా ప‌క్కన పెట్టేశార‌ని, ఈ సినిమా ఉండ‌క‌పోవ‌చ్చనే రూమ‌ర్లు వ‌చ్చాయి. అయితే ఇవేం నిజం కావ‌ట‌. గ‌బ్బర్ సింగ్ 2 ప‌క్కాగా ఉంటుంద‌ని ప‌వ‌న్ స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ప్రకటించాడు. గ‌బ్బర్ సింగ్ 2 టీమ్ ఉత్సాహంగా పనిచేస్తోందని, ప్రస్తుతం లోకేషన్ల వేట సాగుతో౦దట.'మే' లో గ‌బ్బర్ సింగ్ 2 సెట్స్‌పైకి వెళ్ళుతుందని చెప్పాడు. 'సో' గ‌బ్బర్ సింగ్ ముహూర్తానికి సమయం ఆసన్నమైనట్టే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com