Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తàలుàు సినిమా న్యూస్
   న్యూస్   
"ఎందుకంటే ప్రేమంట"
Jun 8, 2012  Telugu Cinema News : Like This :

కథ - ఒకప్పుడు ఒకతను తనను ఎంతగా ప్రేమించినా, తన కుటుంబ పరిస్థితుల వల్ల అతన్ని ప్రేమించి కూడా తన ప్రేమను బయటపెట్టని అమ్మాయిని, ఆమెను ప్రేమించిన కుర్రాడు, తన పాణాల్ని బలిపెట్టి ఆమె ప్రాణాల్నికాపాడతాడు. ఈ విషయం తెలుసుకుని అతని సమాధి మీదే ప్రాణాలు విడుస్తుంది ఆ అమ్మాయి. ఇది 1980 లో జరుగుతుంది. ప్రస్తుతానికి వస్తే రామ్ ఒక కోటీశ్వరుడి కొడుకు. అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే అతనికి బాధ్యత తెలియాలని అతన్ని ప్యారిస్ లో ఉన్న తన స్నేహితుడి వైన్ షాప్ లో కూలీగా పంపిస్తాడు అతని తండ్రి. అక్కడ అతనికి ఇండియన్ అంబాసిడర్ కూతురు స్రవంతి కలుస్తుంది. ఆమె వల్ల విసుగొందిన రామ్ ఆమెను అక్కణ్ణుంచి పొమ్మంటాడు. కానీ రామ్ అక్కణ్ణించి పారిపోయి ఇండియాకు వచ్చే ప్రయత్నంలో స్రవంతి అతన్ని మళ్ళీ కలుస్తుంది. ఆమె సాయంతో ఇండియాకు వచ్చిన రామ్ కు ఆశ్చర్యంగా స్రవంతి అప్పటికి వారంరోజుల క్రితమే చావుబ్రతుకుల మధ్య ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో ఉంటుంది. అసలు స్రవంతికి వారం రోజుల ముందే యాక్సిడెంట్ అయితే మరి ప్యారిస్ నుండి రామ్ ని ఇండియాకు పంపించిన స్రవంతి ఎవరు...? ఈ ప్రశ్నకు సమాధానం కావాలనుకోవటం పెద్ద తప్పిదమే అవుతుంది. అందుకని ఈ సినిమా చూడకపోవటమే మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

విశ్లేషణ - ఈ సినిమాలో బ్రతికున్న అమ్మాయి ఆత్మ తను గత జన్మలో ప్రేమించిన అబ్బాయికి మాత్రమే కనిపించి, తద్వారా తన ప్రాణాన్ని కాపాడుకోవటం స్థూలంగా ఈ చిత్ర కథ. దర్శకుడిగా కరుణాకరన్ ఈ సినిమాని ఏ సందర్భంలోనూ ఆసక్తికరంగా ఉండేలా మలచలేకపోయాడనటంలో అనుమానం అక్కరలేదు. స్క్రీన్ ప్లే, షాట్ టేకింగ్ పక్కన పెడితే అసలు ఈ కథ హీరో రామ్ కి ఎలా నచ్చిందో, చాలా అనుభవమున్న నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ సినిమా తీయటానికి ఎలా అంగీకరించారో అర్థం కాదు. ఈ కథను ఎంచుకోవటంలోనే దర్శకుడు ఫెయిలయ్యాడు. ఇక దర్శకత్వం గురించి వ్రాయటం అనవసరం. నిర్మాణపు విలువలు స్రవంతి మూవీస్ బ్యానర్ కు తగ్గట్టుగానే ఉన్నాయి.

నటన - హీరో రామ్ గురించి కొత్తగా ఈ రోజు చెప్పక్కరలేదు.అతని ఎనర్జీ లెవల్స్ గురించీ, అతని డ్యాన్సింగ్ ఎబిలిటీస్ గురించీ మళ్ళీ చెపితే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టుగా ఉంటుంది. ఒక హీరోగా రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక తమన్నా పాత్ర ఎంత చించుకున్నా మన మనసుకి ఎక్కదు. ఆ పాత్రను దర్శకుడు అంత దరిద్రంగా డిజైన్ చేశాడు. రిషి, కోన వెంకట్ పాత్రలు ఫరవాలేదు. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - ఆడియో వినటానికే అంతంత మాత్రంగా ఉంది. ఇక రామ్ స్టెప్పులు పుణ్యమాని ఈ సినిమాలోని పాటలను చూడగలం కానీ లేకుంటే చూడటానికి పనికిరావు. రీ-రికార్డింగ్ మాత్రం ఫరవాలేదు.

సినిమాటోగ్రఫీ - ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది.

మాటలు - ఒ.కె.

పాటలు - ఒ.కె.

ఎడిటింగ్ - ఫరవాలేదు.

ఆర్ట్ - ఒ.కె.

కొరియోగ్రఫీ - బాగుంది

యాక్షన్ - పీటర్ హెయిన్స్ యాక్షన్ బాగుంది.

మొత్తానికి ఈ సినిమా చూడటానికి వెళ్తే వీరబలి కావటం ఖాయం. హీరో రామ్ కోమయితే మాత్రం ఈ సినిమా ఓ సారి చూడాలనుకుంటే చూడండి. మీ ఇష్టం.

 
<<   దిల్ రాజు "పిల్లా నువ్వులేని జీవితం" "శకుని" ఆడియో రిలీజ్   >>
Posted By dongareviewer Posted Date: 2012-06-12 07:06:10
arey em rasav ra nee ayya nee kasalu rayatam vacha, picha lk nuvvoka revieewer vi, asalu movie ki analysis cheyyatam vacha, nee erri puka, lk bal, review rayaku ra nuvvu anni bagunnai ani rasthav, bagopothe dairyam ga raayi ra gandu
Reply
 
 
Related Movie News
రేపటి నుండి రామ్ "ఒంగోలు గిత్త"
రేపటి నుండి రామ్ "ఒంగోలు గిత్త" షూటింగ్ గుంటూరులో ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే చురుకైన యువ హీరో రామ్ హీరోగా, ఒక కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న నూతన చిత్రం "ఒంగోలు గిత్త".
More »
ద్విభాషా చిత్రంగా రామ్ "ఎందుకంటే ప్రేమంట"
ద్విభాషా చిత్రంగా రామ్ "ఎందుకంటే ప్రేమంట" చిత్రం నిర్మించబడుతూందట. వివరాల్లోకి వెళితే స్రవంతి పిక్చర్స్ పతాకంపై, రామ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాభాటియా హీరోయిన్ గా, "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న చిత్రం "ఎందుకంటే ప్రేమంట".
More »
"ఎందుకంటే...! ప్రేమంట...!"లో రామ్ న్యూలుక్
"ఎందుకంటే ప్రేమంట"లో రామ్ న్యూలుక్ విడుదలయ్యింది. వివరాల్లోకి వెళితే మొన్న విడుదలైన 'కందిరీగ" చిత్రం శతదినోత్సవం జరుపుకుంది.
More »
డబ్బింగ్ లో రామ్ "ఎందుకంటే....ప్రేమంట"
డబ్బింగ్ లో రామ్ "ఎందుకంటే....ప్రేమంట" ఉందని తెలిసింది. వివరాల్లోకి వెళితే "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, చురుకైన యువ హీరో రామ్ హీరోగా అందాల మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నిర్మిస్తున్న చిత్రం "ఎందుకంటే....ప్రేమంట" .
More »
రామ్, నాగ చైతన్యల మధ్య పోరు
రామ్, నాగ చైతన్యల మధ్య పోరు జరుగబోతోంది. వివరాల్లోకి వెళితే యువ హీరోలు రామ్, నాగచైతన్యలు హీరోలుగా నటించిన చిత్రాలు రెండూ ఒకే నెలలో, ఇంకా చెప్పాలంటే ఒకే వారంలోనే విడుదల కాబోతున్నాయి. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, రామ్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం "కందిరీగ".
More »