ఆ "చిత్రమ్" ప్రాఫిట్స్‌తో ప్రకంపనలు !
on Jul 2, 2013

"ప్రేమకథా చిత్రమ్"కు వస్తున్న ఫ్రాఫిట్స్ ప్రకంపనలు పుట్టిస్తున్నాయ్. ముందు ఎబౌ యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అనంతరం బ్లాక్‌బస్టర్‌గా డిక్లేర్ చేయబడింది. ఈ చిత్రానికి పెట్టిన ఖర్చుతో పోల్చితే.. నిజంగానే ఈ చిత్రం బ్లాక్‌బస్టరే.
మారుతి గత చిత్రాలు "ఈరోజుల్లో, బస్‌స్టాప్" చిత్రాలను మించి ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఈ చిత్రం రీమేక్ రైట్స్‌కు ఫ్యాన్సీ రేట్స్ పలకడంతో.. నిర్మాతల పంట పండింది. "ప్రేమకథా చిత్రమ్" తమిళ రీమేక్ రైట్స్‌కు ఎనభై లక్షలు పకలగా.. హిందీ రీమేక్ రైట్స్‌ను మహేష్‌బాబు చిన్నాన్న జి.ఆదిశేషగిరిరావు కోటి రూపాయలకు తీసుకొన్నారు. ఇక కన్నడ, మలయాళ, భోజపురి వంటి భాషలన్నీ కలిపితే.. అవో కోటి రూపాయల వరకు వచ్చే అవకాశముంది.
ఈరేంజ్‌లో కోట్లుకుకోట్లు వచ్చి పడుతుండడంతో.. ఆ డబ్బంతా ఏం చేసుకోవాలో తెలియక.. "ప్రేమకథా చిత్రమ్"కు సీక్వెల్‌గా "పెళ్లికథా చిత్రమ్" తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



