Home

»

Latest News

మెగాఫ్యాన్స్ పై దాసరి అసహనం

Mar 16, 2015 5:06PM

అసహనంతో అన్నాడో, లేక అనుకునే అన్నాడో కాని టాలీవుడ్‌ లెజెండరీ డైరక్టర్‌ దాసరి నారాయణరావు మరోసారి ‘మెగా’పై చురకలు అంటించాడు. సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి ఆడియోకు చీఫ్‌గెస్ట్‌గా వచ్చిన దాసరి నారాయణరావు స్పీచ్‌ అందుకోగానే.. ఫ్యాన్స్‌ నుంచి పవన్‌ పవన్‌ అంటూ అరుపులు వినిపించాయి. కాసేపు సైలెంట్‌ అయిన దాసరి మీరు కామ్‌గా ఉంటే నేను మాట్లాడుతా అని ఫ్యాన్స్‌తో అన్నాడు. ఆ వెంటనే మీరందరికి ఓ అలవాటు అయ్యింది. అభిమాన నటుడి కోసం ఇంతదూరం వస్తారు కాని, వారి గురించి మాట్లాడితే మాత్రం వినరు ఇలా చేస్తే నేను మాట్లాడకుండా వెళ్లిపోతా. నేను అల్లు రామలింగయ్య గారిని మా కుటుంబంలో పెద్దగా భావిస్తా అందుకే ఈ ఆడియో ఫంక్షన్‌కు వచ్చానని అంటూ మెగా అభిమానులకు సుతిమెత్తగా చురకలు అంటించాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com