Home

»

Latest News

రానా డిపార్ట్ మెంట్ ఆగస్టులో

Jul 23, 2011 6:09PM

రానా "డిపార్ట్ మెంట్" ఆగస్టులో ప్రారంభం కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పోలీసుల జీవితాల మీద, పోలీసు వ్యవస్థ మీద ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తీయనున్న చిత్రం "డిపార్ట్ మెంట్". "డిపార్ట్ మెంట్" చిత్రంలో ముందుగా అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తారని అనుకున్నారు. కారణాలు తెలియవు కానీ ప్రస్తుతం అతనీ "డిపార్ట్ మెంట్" చిత్రంలో నటించటం లేదు. అతని స్థానంలో రానా "డిపార్ట్ మెంట్" చిత్రంలో నటించబోతున్నాడు.

అభిషేక్ బచ్చన్ నటించక పోవటానికి కారణం అతని డేట్లు అడ్జెస్ట్ కాకపోవటమేనని వర్మ అన్నాఅందుకు వేరే కారణాలున్నాయని బాలీవుడ్ మీడియా అంటోంది. "డిపార్ట్ మెంట్" చిత్రం ఆగస్టులో ప్రారంభం కాబోతూందని తెలిసింది. ఈ చిత్రం రానా హిందీలో సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రమవుతుంది. రానా ప్రస్తుతం ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పరుచూరి కిరీటి నిర్మిస్తున్న"నా ఇష్టం" చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రానా సరసన జెనీలియా హీరోయిన్ గా నటిస్తూంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com