Home

»

Latest News

ఘనంగా ప్రారంభమైన యెల్లో ఫ్లవర్స్ మూవీ

Feb 6, 2012 2:15PM

ఘనంగా ప్రారంభమైన యెల్లో ఫ్లవర్స్ మూవీ. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అధినేత డాక్టర్ వెంకట్‍ సమర్పణలో, యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లుగా, రవికుమార్ చావలి దర్శకత్వంలో, రమేష్ పుప్పాల నిర్మిస్తున్న చిత్రం "ప్రొడక్షన్ నంబర్ 2". ఈ చిత్రం ఫిబ్రవరి 6 వ తేదీన, హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోలో, దర్శకరత్న, డాక్టర్ దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, రెబెల్ స్టార్ కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, ముహూర్తం షాట్ కు దాసరి గౌరవ దర్శకత్వం వహించగా ఈ చిత్రం అశేషంగా విచ్చేసిన బాలయ్య అభిమానుల సమక్షంలో ఘంనంగా ప్రారంభమయ్యింది.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో బాలయ్య ప్రసంగిస్తూ ఈ చిత్రంలో తనపాత్ర చాలా బాధ్యతాయుతమైందనీ, అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అన్ని అంశాలూ ఈ కథలో ఉంటూనే కథ కొత్తగా ఉంటుందనీ అన్నారు. ఈ చిత్రంలో బాలయ్య పాత్రపేరు నరహరి అని తెలిసింది. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తూండగా, ఘటికాచలం మాటలనూ, సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీని, గౌతం రాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com