Home

»

Latest News

"అధినాయకుడు" మార్చ్ 23 న...?

Feb 1, 2012 12:02PM

"అధినాయకుడు" మార్చ్ 23 న...? విడుదల కానుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తూండగా, జయసుధ, సలోని, లక్ష్మీరాయ్, ఛార్మిప్రథాన పాత్రల్లో నటిస్తూండగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "అధినాయకుడు". ఈ "అధినాయకుడు" చిత్రం నిజానికి సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల కావలసింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఫిబ్రవరి 18 శివరాత్రికి రిలీజన్నారు...కానీ ప్రస్తుతం మార్చ్ 23 వ తేదీన ఈ "అధినాయకుడు" చిత్రం విడుదలవుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com