Home

»

Latest News

రామ్‌చ‌ర‌ణ్ క్యార్‌వాన్‌లో దొంగ‌లు ప‌డ్డారు

May 7, 2015 1:12PM

ఓ హీరో క్యార్ వాన్‌లో దొంగ‌లు ప‌డ్డార‌ని ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు ఎత్తుకెళ్లిపోయార‌నే వార్త ఇండ్ర‌స్ట్రీలో ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆ హీరో.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌కి ఓ సొంత క్యార్‌వ్యాన్ ఉంది. కొద్దిరోజుల క్రింద‌ట ఆ క్యార్ వేన్‌లో ఉండాల్సిన న‌గ‌దు మాయ‌మైంద‌ట‌. దాదాపు రూ.30 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ క్యాష్ ఉంద‌ని, అది సడ‌న్‌గా మాయ‌మైంద‌ని చెప్పుకొంటున్నారు. క్యాష్ మాయ‌మైంద‌న్న విష‌యం చ‌ర‌ణ్‌కీ ఆల‌స్యంగా తెలిసింద‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ సిబ్బందిలోనే ఎవ‌రో... ఈ డ‌బ్బు కాజేశార‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని తెలిసింది. అస‌లు క్యార్ వేన్‌లో అంత డబ్బు ఎందుకుంది అనేది కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే రామ్‌చ‌ర‌ణ్‌గానీ, స‌న్నిహితులుగానీ ఈ విష‌య‌మై పోలీసుల‌కు ఎలాంటి ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం కొస‌మెరుపు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com