Home

»

Latest News

మెగా హీరో 'కంచె' పూర్తి

Jul 06, 2015

'ముకుంద' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు మెగా బ్రదర్ నాగాబాబు తనయుడు వ‌రుణ్‌తేజ్‌. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయినా.. వ‌రుణ్ మాత్రం ఓకే అనిపించుకొన్నాడు. ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. టైటిల్ 'కంచె'. ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయ్యింది. ఈ రోజు చిత్రానికి గుమ్మడికాయ్ కొట్టేశారు. 1940 కాలం నాటి క‌థ ఇది. ఇందులో వ‌రుణ్ ఓ సైనికుడిగా క‌నిపిస్తాడ‌ని టాక్‌. ప్రేమ‌, దేశ‌భక్తి క‌ల‌బోసిన ఈ క‌థ‌లో అన్నిర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాలూ ఉంటాయ‌ని యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం తర్వాత పూరీ దర్శకత్వంలో చిత్రానికి రెడీ అవుతున్నాడు వరుణ్. జూలై 10న ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com