Home

»

Latest News

బ‌న్నీ థ్యాంక్స్ చెప్ప‌డం లేదు

Apr 17, 2015

అత్తారింటికి దారేది ఘ‌న‌విజ‌యం సాధించిన త‌ర‌వాత‌.. టీమ్ అంతా క‌ల‌సి థ్యాంక్యూ ఫంక్ష‌న్ చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలోనే పైర‌సీ వీరుల తాట తీస్తా.. అంటూ ప‌వ‌న్ రెచ్చిపోయి ప్ర‌సంగించాడు. ఆ సినిమా ఎంత హిట్ట‌య్యిందో ఆ పోగ్రాం అంత‌కంటే హిట్ట‌య్యింది. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తికి కూడా థ్యాంక్యూ ఫంక్ష‌న్ చేద్దామ‌ని త్రివిక్ర‌మ్ అండ్ టీమ్ నిర్ణ‌యించుకొంది. అందుకోసం ఈనెల 18న ముహూర్తం ఫిక్స్ చేశారు. శిల్ప క‌ళావేదిక‌నూ బుక్ చేశారు. అయితే ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మం పోస్ట్ పోన్ అయ్యింది. అదే స‌మ‌యంలో శిల్ప‌క‌ళావేదిక‌లో మ‌రో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుండ‌డంతో వెన్యూ దొర‌క‌లేదు. ప్ర‌స్తుతానికైతే స‌త్య‌మూర్తి త‌న‌ని ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ చెప్ప‌డం లేదు. ఈ ఫంక్ష‌న్ ఎప్పుడు, ఎక్క‌డ నిర్వ‌హిస్తార‌నే విష‌యంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com