Home

»

Latest News

పవన్ తో సినిమా.. ఒక్క ఫోన్ కాలే దూరం

Jun 20, 2015 11:36AM

సంపత్ నంది..ఫస్ట్ చిన్న సినిమా చేసి, అందరి దృష్టిని తన వైపు తిప్పుకుని, రామ్ చరణ్ పిలుపు అందుకుని రచ్చ..చేసాడు. ఆ వెంటనే పవర్ స్టార్ దృష్టిని ఆకర్షించాడు. గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ మీద ఏడాది కృషి చేసాడు. బ్యాడ్ లక్. ఎక్కడో ఏదో జరిగింది..కానీ కష్టం ఎక్కడికీ పోదు. అందుకే రవితేజ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా 60శాతం పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్ తో మాత్రం ఎప్పటికైనా సినిమా చేసి తీరతానని అంటున్నాడు ఈ యువ దర్శకుడు.

''గబ్బర్ సింగ్ సినిమా ఆగిపోయిన తరువాత మీడియాలో అనేక రూమర్లు వచ్చాయి. అవేం నిజం కాదు..కొన్ని పరిస్థితులే కారణం.  పవన్ కళ్యాణ్ మా మధ్య ఎంతో స్నేహానుబంధం ఉంది. మా ఇద్దరి మధ్య దూరమల్లా - ఒక్క ఫోన్ కాలే!'' అని అంటున్నాడు సంపత్ నంది. బెంగాల్ టైగర్ అందరూ అనుకుంటున్నట్లు పోలీసు కథ కాదట, హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్‌ప్లే బేస్డ్ మాస్ ఎంటర్‌టైనర్ అంటా. ఈ సినిమా సెప్టెంబర్ 18 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com