Home

»

Latest News

సమ్మూ లక్కీ గాళ్!

May 26, 2015

క్యూట్ గాళ్ సమంత భలే సంతోషంగా ఉందట. నటనకు అవకాశం ఉన్న సినిమాకి తన పేరు పరిశీలిస్తున్నారని తెలిసి సంబరపడుతోందట. ఇప్పటికే ఓ సీనియర్ హీరోతో కలసి నటించిన క్యూట్ గాళ్ మరో సీనియర్ హీరోతో నటించబోతోందట. బాలీవుడ్ లో హిట్టైన పీకూ సినిమాపై తెలుగు దర్సకనిర్మాతల కన్ను పడింది. అందులో దీపిక నటనకు విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. దీంతో దీపికను రీప్లేస్ చేసే నాయిక ఎవరా అని ఆలోచిస్తే తాజా తారల్లో సమంతే బెస్ట్ అనుకున్నారట. అది సరే బిగ్ బీ ప్లేస్ లో నటించేదెవరంటే.....అందరి చూపూ రీమేక్ రాజా వెంకీవైపు మళ్లింది. ఈ మధ్య గోపాల గోపాల, దృశ్యం రీమేక్ ల్లో హుందాగా నటించి మంచి పేరు తెచ్చుకున్న వెంకటేశ్....బిగ్ బీ క్యారెక్టర్ కి న్యాయం చేస్తాడంటున్నారు. ఇంకొందరేమో...అమితాబ్ క్యారెక్టర్ కి ప్రకాశ్ రాజ్, ఇర్పాన్ పాత్రలో వెంకీ అయితే సరిపోతారంటున్నారు. ఏదిఏమైనా వెంకీ-సమంత కాంబినేషన్ ఖరారైనట్టే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా సరే....ఇంతకీ పీకూ రీమేక్ ఖాయమేనా? చూద్దాం!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com