Home

»

Latest News

ర‌వితేజ అద్భుతం చేయాలిక‌..

May 11, 2015

రవితేజ అంటే మినిమం గ్యారెంటీ హీరో! త‌న పెట్టుబ‌డి తాను తీసుకొచ్చేయ‌గ‌లిగేంత సామ‌ర్థ్యం ఉంది. ఓ రేంజు బ‌డ్జెట్‌లో సినిమా పూర్త‌యితే... నిర్మాత‌కు లాభాలు రావ‌డం పెద్ద క‌ష్టమేం కాదు. వ‌రుస‌గా అడ‌ర‌జ‌ను ఫ్లాపుల త‌ర‌వాత బ‌లుపు, ప‌వ‌ర్ సినిమాల‌తో మ‌ళ్లీ రేసులోకి వ‌చ్చాడు ర‌వితేజ‌. ఇవేం... బాక్సాఫీసు వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టిన సినిమాలేంకాదు. ఇది వ‌ర‌కు సినిమాల‌తో, వ‌సూళ్ల‌తో పోలిస్తే కాస్త బెట‌ర్‌. నిర్మాత‌కు భారీ లాభాలు రాక‌పోయినా, న‌ష్ట‌పోలేదు. అయితే ఈ లెక్క‌లేం ప‌ట్టించుకోకుండా కిక్ 2 సినిమాపై కోట్లు ధార‌బోశారు. ఈచిత్రానికి రూ.40 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని స‌మాచారం. కేవ‌లం సురేంద‌ర్‌రెడ్డిని న‌మ్మి.. క‌ల్యాణ్‌రామ్ రూ.40 కోట్ల బ‌డ్జెట్ కేటాయించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ర‌వితేజ సినిమా హిట్టయితే ఎక్కువ‌లో ఎక్కువ రూ.25 కోట్లు సాధిస్తుంది. భారీ విజ‌య‌మైతే రూ.30 కోట్లు వేసుకోవాలి. దాన్ని మించిన దాఖ‌లాలేం లేవు. అయితే సురేంద‌ర్‌రెడ్డి రేసుగుర్రంతో రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరాడు. అందువ‌ల్ల సురేంద‌ర్‌రెడ్డిని న‌మ్మి ఇంత భారీ బ‌డ్జెట్ కేటాయించ‌గ‌లిగాడు. సినిమాకి ద‌ర్శ‌కుడెవ‌రైనా... జ‌నాలు థియేట‌ర్ కి రావాలంటే హీరో స్టామినా చాలా ముఖ్యం. ర‌వితేజ స్టామినా రూ.30 కోట్లే. దాన్ని దాటి.. రూ.40 మార్క్ చేరుకోవాలంటే, క‌ల్యాణ్‌రామ్‌కి లాభాలు తెచ్చిపెట్టాలంటే ర‌వితేజ నిజంగానే ఓ అద్భుతం చేయాలి. మ‌రి అది కిక్ 2 తో సాధ్య‌మ‌వుతుందా?? వెయిట్ అండ్ సీ.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com