Home

»

Latest News

'బాహుబలి' బాబులా 'కబాలి'.. నాలుగు షోలు చూస్తానన్న వర్మ

May 1, 2016 4:57PM

 

ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ తనకు ఏదైనా సినిమా నచ్చిచే మాత్రం దానికి ఆకాశానికి ఎత్తేస్తాడు. గతంలో బాహుబలి సినిమాను తెగ పొగిడేసిన వర్మ ఇప్పుడు 'కబాలి' సినిమాను ఆకాశానికెత్తేస్తున్నాడు. ఈరోజు 'కబాలి' సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన వర్మ.. 'బాహుబలి' బాబులా 'కబాలి' సినిమా ఉంటుందని అంటున్నాడు. అంతేకాదు ఒక్క రజనీకాంత్ తప్ప ఇంకే సూపర్ స్టార్ కూడా వెండితెరను వైబ్రేట్ చేయలేరని.. కబాలి సినిమా విడుదలైన రోజే నాలుగు షోలు చూస్తానని కూడా ముందుగానే ప్రకటించేశాడు. కాగా ఈరోజే విడుదలైన కబాలి టీజర్ లైకులు, షేర్లతో దూసుకుపోతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com