Home

»

Latest News

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్ళెప్పుడు

Apr 17, 2011 11:22AM

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్ళెప్పుడు అని సినీ పరిశ్రమే కాదు...యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఆరడుగుల పైనుండే భారీ పర్సనాలిటీతో కండలు తిరిగిన ధృఢమైన దేహంతో ఆకర్షణీయంగా అందంగా కనిపించే ఈ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్ళెప్పుడనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ ప్రశ్న మాత్రం కాదు. పోయిన సంవత్సరం ప్రభాస్ నాన్నగారు చనిపోవటం వలన ఈ సంవత్సరం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని వివాహం చేసుకోమని అతని అమ్మగారు కోరుతూండటంతో ప్రభాస్ వివాహానికి తన అంగీకారాన్ని తల్లికి తెలియజేశాడు.

prabhas wall papers, prabhas stills, prabhas images, prabhas pics, prabhas photos, prabhas pictures

అయితే ఈ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్ళాడబోయే ఆ అదృష్టవంతురాలెవరు..? ఆమె మన సినీ పరిశ్రమకు చెందిన పిల్లా...? లేక బయటి పిల్లా...? పిల్లెవరనేది ఇంకా తెలియలేదు కానీ మన సినిమా పరిశ్రమకు చెందిన పిల్ల మాత్రం కాదని తెలిసింది. అలాగే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వివాహం పెద్దలు కుదిర్చే పెళ్ళే కానీ ప్రేమ వివాహం కాదని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ సంవత్సరమే వివాహ బంధంలో సెటిలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం తన తోటి హీరోలు అల్లు అర్జున్, యన్ టి ఆర్ లు కూడా పెళ్ళి చేసుకున్నారు గనక తాను కూడా ఇక పెళ్ళిచేసుకోటానికి నిర్ణయించుకున్నారు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com